Homeహైదరాబాద్latest News'కన్నప్ప' సినిమాలో హీరో ప్రభాస్

‘కన్నప్ప’ సినిమాలో హీరో ప్రభాస్

టావీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ ఈ చిత్రీకరణలో పాల్గొని సందడి చేయగా, తాజాగా నటుడు ప్రభాస్ కూడా ఈ సెట్స్​లోకి ఎంట్రీ ఇచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు విష్ణు.

అందులో భాగంగా ప్రభాస్‌ ఈ షూట్​లో పాల్గొన్నారంటూ ఓ ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. అందులో కాళ్లను మాత్రమే చూపించారు. పాదుకలు, పులిచర్మం ఇలా కొన్ని డీటైల్స్​ను మాత్రమే చూపించి అభిమానుల్లో మరింత ఇంట్రెస్ట్ పెంచారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాలో ప్రభాస్​ రోల్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img