పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ”కల్కి 2898 AD”. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై ఘానా విజయం సాధించింది. ఈ సినిమా మహాభారతం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో శ్రీ కృష్ణుడి ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. మరి కల్కి రెండో భాగంలో కృష్ణుడి పాత్రలో ఎవరు నటిస్తారనే చర్చ అప్పటి నుంచి మొదలైంది. ఇదిలా ఉంటే అభిమానుల ఈ ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానం ఇస్తూ అన్ని రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు.ఈ సినిమాలో శ్రీకృష్ణుడి ముఖాన్ని చూపించాలని అనుకోలేదు.. అయితే ఫుల్ లెంగ్త్ రోల్ అయితే దానికి మహేష్ బాబు పర్ఫెక్ట్ అని భావిస్తున్నా.. అప్పుడు కృష్ణుడి పాత్రలో ఊహించుకుంటే.. అతను దీన్ని బాగా చేస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు.