ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ మూవీ మరో మైలురాయిని దాటింది. ఈ మూవీ వసూళ్ల పరంగా నార్త్ అమెరికాలో మరో రికార్డు క్రియేట్ చేసింది.. ఇప్పటి వరకు 18.5మిలియన్ డాలర్లు వసూళ్లు చేసి నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు 18.5మిలియన్ డాలర్లు వసూళ్లు చేసి నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో షారుక్ నటించిన ‘పఠాన్’ 17.45మిలియన్ డాలర్ల సాధించగా… తాజాగా ‘కల్కి’ దాన్ని అధిగమించింది.