రచయితలను ప్రోత్సహించడం, లక్ష్యంగా ప్రభాస్ ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రభాస్, తన అన్న ప్రమోద్ తో కలిసి ‘ది క్రాఫ్ట్’ అనే సంస్థను స్థాపించారు. తాజాగా ఈ సంస్థకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం, కథా రచయితలు దర్శకులకు అవకాశం కల్పించబోతున్నట్లు. ఐదు భాషల్లో ఈ ప్రకటన ఇచ్చారు.“మీ దగ్గర మంచి కథలు ఉన్నప్పటికీ అవకాశాలు రావడం లేదా?.. మీ లాంటి వారి కోసమే ఒక వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆ వెబ్ సైట్ లో మీ కథను అప్ లోడ్ చేయండి. ఆ కథలను ప్రేక్షకులను చూస్తారు. ఎక్కువ మందికి నచ్చిన కథలను ఎంపిక చేస్తాం. వాటిని సినిమాగా తీసుకొస్తాం” అని తెలిపారు. ఈ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఆసక్తి ఉన్న కథా రచయితల నుంచి మంచి కథలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ మీకూ ఇండస్ట్రీలో రాణించాలని ఆసక్తిగా ఉంటే, ట్రై చేసుకోవచ్చు. కథా రచయితగా, దర్శకుడిగా ప్రయత్నించవచ్చు. www.thescriptcraft.com వేదికగా మీ కథలను పంపుకోవచ్చు. అదృష్టం బాగుంటే అవకాశం లభించవచ్చు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇండస్ట్రీలోకి కొత్త వారికి స్వాగతం పలకాలనే ఆలోచన చాలా గొప్పదంటున్నారు.