Homeహైదరాబాద్latest NewsPrabhas : పహల్గాం దాడి.. ప్రభాస్ చుట్టూ వివాదం.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..!!

Prabhas : పహల్గాం దాడి.. ప్రభాస్ చుట్టూ వివాదం.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..!!

Prabhas : జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దాడిలో 30 మంది చనిపోయారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనే వాదనలు ఉన్నాయి. సోషల్ మీడియాలో పాకిస్థాన్‌ ఉగ్రవాదులను అంతం చేయాలంటూ నెటిజన్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ వివాదంలో ప్రభాస్ చిక్కుకున్నాడు.

ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ” ఫౌజీ” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పాకిస్తాన్ బ్యూటీ ఇమాన్వి నటిస్తోంది. తాజాగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ నటిని సినిమా నుంచి తొలగించాలని నెటిజన్లు మరియు కొందరు ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికలలో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇమాన్ వీ షాజీని సినిమా నుంచి బ్యాన్ చేయాలనీ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇమాన్వి కుటుంబం పాకిస్తాన్ కు చెందినది అయినప్పటికీ ఆమె ఢిల్లీలో పుట్టి పెరిగింది.

Recent

- Advertisment -spot_img