Prabhas : యువత అతి తక్కువ సమయంలోనే డబ్బులు సంపాదించాలి అని అడ్డా దారులు తొక్కుతూ బెట్టింగ్ యాప్ స్కాం వలలో పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ బెట్టింగ్ వలలో పడి చనిపోతున్నారు.. అలాగే తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే రోజు రోజుకి పెరిగిపోవడంతో దీనిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసారు. ఇటీవలే కొంత మంది సినీ ప్రముఖలుపై హైదరాబాద్ సిటీ పోలీసుల కేసు నమోదు చేసారు. తాజాగా బెట్టింగ్ యాప్ కేసులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నందమూరి బాలకృష్ణ, హీరో గోపీచంద్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. నందమూరి బాలకృష్ణ హోస్టుగా ”అన్‌స్టాపబుల్” అనే టాక్ షో చేస్తున్నారు. ఈ షో ప్రముఖ ఓటిటి ”ఆహా”లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే గతంలో ఈ టాక్ షోకి ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ లుగా వచ్చారు. అయితే ఆ షోలో ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసారు అని బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఒక వ్యక్తి ఫిర్యాదు చేసాడు. స్టార్ హీరోలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడంతో లక్షలాది మంది డబ్బు పోగొట్టుకున్నారని, మ్యూల్ ఖాతాల ద్వారా చైనీయులకు ఈ నగదు చేరిందని రామా రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేసాడు. అయితే మరి పోలీసులు దీనిపై ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి.