Homeహైదరాబాద్latest NewsPrabhas : సడన్ ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్.. లోకేష్తో షూటింగ్ షురూ

Prabhas : సడన్ ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్.. లోకేష్తో షూటింగ్ షురూ

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ”రాజాసాబ్”, ”ఫౌజీ”, ”సాలార్ 2”, ”స్పిరిట్” సినిమాలు చేస్తున్నాడు. అయితే అందరూ ప్రభాస్ తన తదుపరి సినిమాని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ”స్పిరిట్” సినిమా చేస్తాడు అని భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందలు చేస్తూ తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ వచ్చాడు. అయితే ప్రభాస్ హోంబాలే ప్రొడక్షన్ లో మూడు సినిమాలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాని లోకేష్ తో చేయబోతున్నాడు. అయితే రజినికాంత్ తో లోకేష్ తీస్తున్న ”కూలీ” సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రభాస్ తో తక్కువ సమయంలోనే సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. కేవలం మూడు నెలల్లోనే ప్రభాస్ తో ఒక గ్యాంగ్ స్టార్ సినిమాని లోకేష్ కనకరాజ్ తన స్టైల్ లో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా కధ మొత్తం ఒక నైట్ లోనే జరుగుతుంది సమాచారం.ప్రభాస్ ఈ సినిమాలో వరుసగా మూడు నెలల డేట్స్ ను ఇచ్చాడు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మే నెలలో మొదలు కాబోతుంది. అయితే ఈ క్రమంలో ”స్పిరిట్” సినిమా షూటింగ్ మరి కాస్త ఆలస్యం కాబోతుంది.

Recent

- Advertisment -spot_img