Prabhas : ప్రస్తుతం ఇండియాలోనే ఏ హీరో లేనంత బిజీగా ప్రభాస్ (Prabhas) ఉన్నాడు. ప్రభాస్ చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. ”రాజాసాబ్”, ”ఫౌజీ” సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే ”సాలార్ 2”, ”స్పిరిట్”, ”కల్కి 2” సినిమాలు షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అయితే ఈ సినిమాలు అన్ని పూర్తి అవ్వడానికి దాదాపు నాలుగు నుండి ఆరు ఏళ్ళు పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అని పూర్తి చేసి ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని ప్రభాస్ ఆలోచిస్తున్నాడు అని సమాచారం. ఎందుకంటే ఇటీవలే ప్రభాస్ ఆరోగ్యా పరిస్థితి బాగ క్షిణించింది అని తెలిసిన విషయమే.. అయితే ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంటున్నాడు. అందుకే కొన్ని ఏళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మొదలు కావలిసిన ”స్పిరిట్” సినిమా షూటింగ్ కూడా వాయిదా వేశారు. తిరక లేకుండా వరుసగా సినిమాలు చేయడంతో ప్రభాస్ బాగా అలసిపోయాడు అని.. అందుకే కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండలని నిర్ణయం తీస్కున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న షూటింగ్ దశలో ఉన్న సినిమాలు పూర్తి చేసి ఆపై కొన్నాళ్లపాటు సినిమాలు చేయకూడదు అని ప్రభాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.