Homeహైదరాబాద్latest NewsPrabhas : ''రాజాసాబ్'' మూవీ టీజర్ రెడీ.. కానీ ప్రభాస్ ఎక్కడ..?

Prabhas : ”రాజాసాబ్” మూవీ టీజర్ రెడీ.. కానీ ప్రభాస్ ఎక్కడ..?

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ”ది రాజా సాబ్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 1960ల నేపథ్యంలో సాగే కథతో రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్ నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ఇటీవల రెడీ అయినట్లు సమాచారం.. ఇప్పటికే దర్శకుడు మారుతి రఫ్ కట్‌ను ఇండస్ట్రీలోని సన్నిహితులకు చూపించారని.. సినిమా టీజర్ అద్భుతంగా ఉందని అంటున్నారు. ప్రభాస్ డబ్బింగ్ పూర్తి చేయడానికి విదేశాల నుంచి తిరిగి రాగానే టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. టీజర్‌లో ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు చూడని VFX విజువల్స్ ఉంటాయని, హారర్ జోనర్‌లో ఇలాంటి రేంజ్ విజువల్స్ రాలేదని టాక్. ఈ సినిమాని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img