తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా తయారీపై అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబరు 6 నాటికి ఓటరు జాబితా ముసాయిదా తయారు చేయాలని ఆదేశించారు. సెప్టెంబరు 21న తుది ఓటరు జాబితా ప్రచురించాలని సూచించారు. ఈ సమీక్షకు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారులు హాజరయ్యారు. ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం ‘గ్రీవెన్స్ మాడ్యూల్’ ప్రారంభించారు.