– కేఏ పాల్ విమర్శలు
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తమ పార్టీ మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ కాపీ కొట్టిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆయన విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ వాళ్లకు సీట్లు తక్కువ వస్తే కాంగ్రెస్ వాళ్లను కలుపుకుని మళ్లీ అధికారంలోకి కేసీఆర్ రావాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలారా ఆలోచన చేయండంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తనకు ఓటు వేసి గెలిపించాలని, తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తానని కేఏ పాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన డబ్బులను తీసుకుని తనకు ఓటు వేయాలన్నారు. జనాల దగ్గర నుండి దోచుకున్న సొమ్మును తీసుకుని మళ్ళీ జనాలకు పంచుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తుందా?… తెలంగాణ రక్షించుకోవడానికి ఇది చివరి అవకాశమన్నారు. ప్రజలారా ఆలోచన చేసి ఓటు వేయాలంటూ కేఏ పాల్ వెల్లడించారు.