లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ భారత్‌కు తిరిగి రానున్నారు. మే 31 న సెట్ ముందు హాజరవుతానని ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘నా విదేశీ పర్యటన ముందస్తు ప్రణాళికలో భాగమే. నోటీసులు ఇచ్చినప్పుడు వారం రోజులు సమయం కోరాను. కాంగ్రెస్ నాయకులు నాపై రాజకీయ కుట్ర చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తాను’ అని అన్నారు.