Prakash Raj : దేశంలోని యువత తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలని అడ్డా దారులు తొక్కుతూ బెట్టింగ్ యాప్ స్కాం వలలో పడుతున్నారు. ఈ బెట్టింగ్ వలలో చిక్కుకుని తీవ్రంగా నష్టపోతున్న సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోవడంతో దీనిపై పోలీసులు దృష్టి సారించారు. డబ్బు ఇస్తున్నారు కదా అని ముందూ వెనుకా చూడకుండా బెట్టింగ్ యాప్‌లను సెలబ్రిటీలు ప్రమోట్ చేసారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, ప్రణీత, అనన్య నాగళ్ల, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, శ్రీముఖి తదితరులపై కేసు నమోదైంది.
తాజాగా ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) స్పందించారు. అందరిని ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి కదా.. అది 2016లో 9ఏళ్ల కిందట ఆ యాడ్ నేను చేశాను నిజం ఆ తరువాత కొన్ని నెలల తరువాత నేను అది తప్పని తెలుసుకున్నాను. ఆ తరువాత నేను ఎలాంటి బెట్టింగ్ యాప్ ప్రొమోషన్స్ చేయలేదు. దయచేసి యువతలు ఇలాంటి బెట్టింగ్ యాప్ అనేది ఒక వ్యసనం.. ఇవి అడ్డి మీ జీవితాన్ని కోల్పోవద్దు అని ప్రకాశ్‌రాజ్‌తెలిపారు.