Homeసినిమాఒక్క సినిమాకే.. కంగనపై ప్రకాశ్‌రాజ్‌ సెటైర్

ఒక్క సినిమాకే.. కంగనపై ప్రకాశ్‌రాజ్‌ సెటైర్

హైదరాబాద్‌: ‘మణికర్ణిక’ సినిమాలో నటించినంత మాత్రాన కంగనా రనౌత్‌ రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్‌ అయిపోతారా..! మ‌రీ దీపికా పదుకొణె ‘పద్మావతి’ అవ్వాలి.. హృతిక్‌ రోషన్‌ ‘అక్బర్‌’, షారుక్‌ ఖాన్‌ ‘అశోక’, అజయ్‌ దేవగణ్‌ ‘భగత్‌ సింగ్‌’, ఆమిర్‌ ఖాన్‌ ‘మంగళ్‌ పాండే’, వివేక్‌ ఒబెరాయ్‌ ‘మోదీ జీ’గా మారాలి.. మరి వాళ్లేం కావాలి’ అంటూ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ వేసిన సెటైర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. justasking ట్యాగ్‌ను జతచేసి ప‌రోక్షంగా కంగ‌నా తీరును ప్ర‌కాశ్‌రాజ్ విమ‌ర్శించారు. కంగనా గ‌త కొంత‌కాలంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం, ముంబాయి పోలీసుల‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img