తిరుమల లడ్డూ వ్యవహారంలో తనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ‘ఇప్పుడే మీ ప్రెస్మీట్ చూశాను. నేను ట్వీట్ చేసిందేంటి? మీరు దానిని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తేదీ తర్వాత మీ ప్రతీ మాటకు సమాధానం చెబుతాను. ఆ లోపు వీలైతే నా ట్వీట్ను మరోసారి చదివి అర్థం చేసుకోండి’ అని ఓ వీడియోను పోస్ట్ చేశారు.