Homeహైదరాబాద్latest Newsతిరుమలలో ప్రాంక్ వీడియో..చిక్కుల్లో పడిన బిగ్‌బాస్ బ్యూటీ..!

తిరుమలలో ప్రాంక్ వీడియో..చిక్కుల్లో పడిన బిగ్‌బాస్ బ్యూటీ..!

తెలుగు సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ ఆ తరువాత బిగ్‌బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ప్రియాంక వివాదంలో చిక్కుకుంది. తన ప్రియుడు శివకుమార్‌ తో కలిసి ప్రియాంక యూట్యూబ్ లో ఫ్రాంక్ వీడియోలు చేస్తుంది.అయితే ఇటీవలే ఆమె తిరుమలలో చేసిన ప్రాంక్ వీడియో కారణంగా పెద్ద దుమారమే చెలరేగింది. ప్రియాంక శివకుమార్‌ తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది. అయితే తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడవ మైలురాయి అయిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గర ఇద్దరూ కలిసి రీల్స్‌ చేశారు. చిరుత పులి వచ్చిందంటూ ఫేక్‌ ఆడియో పెట్టి అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం తిరుమల వెళ్లే దారిలో చిరుత ఎటాక్‌..? అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే ఇది అంతా ఫ్రాంక్ అంటూ వీడియో చివరిలో జనాలని ఫూల్స్ చేసేశారు. ప్రస్తుతం ఈ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రియాంక పవిత్ర మార్గంలో ఇలాంటి వీడియోలు చేయడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఆధారంగా వీరిద్దరిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది అని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img