రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంటారని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇదే విషయాన్ని ఏడాది క్రితం జగన్‌కు చెప్పినట్లు ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారకుల్లో ఈయన ఒకరు. నవరత్నాలు పథక రూపకల్పనలో కీలక పాత్ర పోశించాడు. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉంటుంది.