ఏపీలో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోతుందని ప్రశాంత్ కిశోర్ మరోసారి గట్టిగా చెప్పారు. కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకొని గెలిచిన ప్రభుత్వాలు లేవన్నారు. అదే సమయంలో అభివృద్ధి కూడా జరగాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజు నాలుగైదు రౌండ్ల తర్వాత వాళ్లకే అర్థమవుతుందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పార్టీ చాలా తప్పులు చేసిందన్నారు. ముఖ్యంగా తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల ఇద్దరూ ఈసారి వ్యతిరేకంగా పని చేశారన్నారు.