న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియాంకా గాంధీలను కూడా కలిసిన విషయం తెలిసిందే.
రానున్న రాష్ట్రాల ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికల గురించి ప్రశాంత్ కిశోర్.. గాంధీలతో చర్చించినట్లు భావించినా.. అంతకంటే పెద్దదే ఏదో జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పడం గమనార్హం.