ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామంలో పవిత్ర రంజాన్ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. దేశంలో అందరూ బాగుండాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎండీ రసీదు, ఎండీ అంకుష్ కాసీం, చాంద్, అకిం, సల్మాన్, నిజం, యూత్ కాంగ్రెస్ నాయకులు పత్తిపాక తిరుపతి, మధు, రాజేష్ మహేష్, ప్రతాప్‌రెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.