వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గి, వ్యాధులబారిన పడుతుంటాం. అయితే తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- వంటకు, తాగటానికి కాచి చల్లార్చిన నీటిని వాడాలి.
- ఫిల్టర్, వాటర్ ప్యూరిఫైయర్ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
- ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు.
- తాజా పండ్లు, కూరగాయలనే ఉపయోగించాలి.
- కూరగాయలతో భోజనం చేయడం మంచిది.
- పానీపూరీలు, మసాలా పూరీలు, పావుబాజీ వంటి స్ట్రీట్ ఫుడ్లు తినకపోవడం మంచిది.