రోడ్డు ప్రమాదంలో ‘ప్రేమలు’ నటుడు సంగీత్ ప్రతాప్ గాయపడ్డారు. అతడితో పాటు మలయాళ నటుడు అర్జున్ ఆశోకన్ కూడా గాయడ్డారు. మలయాళ నటులైన అర్జున్, సంగీత్ ప్రతాప్‌లు శనివారం కొచ్చిలోని ఎమ్‌జీ రోడ్డుపై కారులో వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అర్జున్‌కు స్వల్ప గాయాలు కాగా..సంగీత్ ప్రతాప్ తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది.