Homeహైదరాబాద్latest Newsప్రేమలు సీక్వెల్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..!

ప్రేమలు సీక్వెల్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..!

‘ప్రేమలు’.. చిన్న మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ కి వచ్చిన రెస్పాన్స్ తో తెలుగులోనూ రిలీజ్ చేశారు. గిరీశ్‌ ఎ.డి. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో నస్లెన్‌ కె.గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమితా బైజూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవ్ ని తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ మార్చిలో విడుదల చేసి సక్సెస్‌ని అందుకున్నారు. ఈ మూవీ కు వచ్చిన పాపులారిటీ చూసి ఇప్పుడు ఈ మూవీ కి సీక్వెల్‌ను ప్రకటించారు. మొదటి పార్ట్ లాగా ఒకసారి మలయాళం తీసి ఆ తర్వాత డబ్ చేయడం కాకుండా.. ఈసారి ఒకేసారి మలయాళం, తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని భాషల పోస్టర్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే రిలీజ్ గురించి కూడా ప్రకటించారు. 2025లో ఈ మూవీని విడుదల చేస్తామని చెప్పారు.

తెలుగుకి సంబంధించి ఎస్ఎస్ కార్తికేయ ప్రేమలు 2 గురించి పోస్ట్ చేశాడు. “నా లైఫ్ లో ప్రేమలు ఒక అందమైన ఛాప్టర్. దీనిని మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మార్చిన తెలుగు ప్రేక్షకులకు నేను రుణపడి ఉంటాను. భావనా స్టూడియోస్ వారి ధన్యవాదాలు. ప్రేమలు 2 మూవీని తెలుగులో ప్రెజెంట్ చేస్తున్నంతు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ తెలుగు వర్షన్ కి సంబంధించి ఎస్ఎస్ కార్తికేయ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. అలాగే మలయాళం, తమిళ్ కి సంబంధించి అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే.. సచిన్ యూకే వెళ్లడంతో ఫస్ట్ పార్ట్ ముగిసింది. సెకండ్ పార్ట్ ని అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారని భావిస్తున్నారు. కొందరు మాత్రం మళ్లీ ఫ్రెష్ గా హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తారని అభిప్రాయ పడుతున్నారు. మరి.. బిగ్గెస్ట్ హిట్టు కొట్టిన మలయాళం మూవీ ప్రేమలుకి సీక్వెల్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Recent

- Advertisment -spot_img