Homeహైదరాబాద్latest Newsపార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కండి

పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కండి

– బీజేపీ జిల్లా నాయకుడు వేముల మధు

ఇదేనిజం, లక్షెట్టిపేట: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం సన్నద్ధం కావాలని బీజేపీ జిల్లా నాయకుడు వేముల మధు పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని విశ్రాంతి భవనంలో బీజేపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పని చేయాలని సూచించారు. గత పదేండ్లుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి చేసిన అభివృద్ధి పనులు, ప్రజల కోసం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చాతరాజు శివ శంకర్, జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్, సీనియర్ నాయకులు రమేష్ చంద్, ముష్కం గంగన్న, నాయకులు కానగంటి మల్లన్న , కోమకుల రవి, రత్నం బాణాల, పాంచాల రమేష్, నల్ల ఆనంద్, వెంకటరమణ, సుధాకర్, విహార్, తిరుపతి, బాబులాల్, రాజమౌళి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img