తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఈ మేరకు ప్రజల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ తీసుకుంటామని అన్నారు. అయితే కొత్త రేషన్ కార్డు పొందడానికి ప్రభుత్వం కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలని, ఈ డాక్యుమెంట్స్ ఆధారంగానే కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని సోషల్ మీడియాలో కొన్ని సమాచారాలు వైరల్ అవుతున్నాయి. రెసిడెన్స్ సర్టిఫికెట్ తో పాటు ఇన్ కమ్ సర్టిఫికెట్, అదేవిధంగా అప్ డేట్ చేయబడిన ఆధార్ కార్డులు ప్రజలంతా రెడీ చేసుకోవాలని అంటున్నారు. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ తో పాటు ఈ డాక్యుమెంట్స్ జత చేయాలని చెబుతున్నారు.