Homeహైదరాబాద్latest Newsప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధం..! వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధం..! వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు

నేడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఏమైందని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారని అన్నారు. జనవరి మూడో వారం నుంచి జిల్లాల్లో పర్యటించి అక్కడే నిద్రిస్తామన్నారు. ప్రతి బుధ, గురువారాల్లో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు అక్కడే బస చేస్తానని చెప్పారు. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ పటిష్టతకు దిశానిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమం చేస్తానని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img