గత ప్రభుత్వ హయాంలో జరిగిన ‘ఫార్ములా ఈ కార్’ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లను కేటీఆర్ ఓ విదేశీ సంస్థకు బదిలీ చేయించారని ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పురపాలకశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ కూడా ఈడీతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల మంత్రి పొంగులేటి దీపావళి బాంబ్ పేలుతుందన్న విషయం తెలిసిందే.