విద్యుత్ భద్రత వారోత్సవాల సందర్భంగా వినియోగదారులు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సంబంధిత ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేసే పోస్టర్ మధిర సబ్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీమతి ఎమ్ అనురాధ గారు ఆవిష్కరించారు. విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా విద్యుత్ శాఖ సిబ్బంది మరియు విద్యుత్ వినియోగదారులు కనీస ప్రమాద నివారణ జాగ్రత్తలు తప్పక పాటించవలసిందిగా ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధిర టౌన్, మధిర రూరల్, ఎర్రుపాలెం, మామునూరు సెక్షన్ల ఏఈలు అనిల్ కుమార్, నాగేశ్వరరావు, అనూష, శ్రీనివాసరావులతోపాటు సబ్ ఇంజనీర్లు లావణ్య, ప్రవీణ్, చీనా, మరియు సబ్ డివిజన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.