Homeహైదరాబాద్latest Newsఐఐటి సాధించిన పేదింటి ప్రతిభావంతునికి అండగా నిలిచిన ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు

ఐఐటి సాధించిన పేదింటి ప్రతిభావంతునికి అండగా నిలిచిన ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు

ఇదే నిజం జూన్ 22 బెల్లంపల్లి : చదువుకు పేదతనం ఉండొద్దని చాటాడు యన్ యస్ యు ఐ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్ధన్ రాజు.ప్రతిష్టాత్మకమైన ఖరగ్ పూర్ ఐఐటి లో సీటు సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి విద్యార్థి దుర్గం చరణ్ తేజ్ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నాడని ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ద్వారా తెలుసుకొని వెంటనే స్పందించి 17,500 లు అందజేసి ఆదర్శంగా నిలిచారు.ఈ సందర్భంగా ఆయన కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో చరణ్ తేజ్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఐఐటి సీటు సాధించి జాతీయ స్థాయిలో బెల్లంపల్లి సత్తాను చాటడం అభినందనీయమన్నారు.

జాతీయస్థాయిలో జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ రెండు దశలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపి సీటు సాధించిన విద్యార్థికి పేదరికం వల్ల ఆగిపోకూడదని తక్షణ సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిభ గల పేదవారికి ఎప్పుడూ మార్వాడీ యువమంచ్ అండగా యంటుందన్నారు. పేద విద్యార్థుల చదువులో ప్రతిభ చూపి బెల్లంపల్లి ప్రతిష్టనుపెంచితే ఆర్ధిక సహాయం చేస్తామని తెలిపారు.తల్లిదండ్రులు ఇద్దరూ దూరమైనా మొక్కవోని దీక్షతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన చరణ్ తేజ్ ఎందరికో ఆదర్శం అయ్యాడన్నారు.విద్యార్థులకు నాణ్యమైన విధ్యనందించడమే కాకుండా ఆర్ధికంగా అండగా నిలిచేలా దాతల దృష్టికి తీసుకు పోతున్న సి ఓ ఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, అధ్యాపకులను ప్రత్యేకకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎర్ర సువర్ణ, శివ, అధ్యాపకులు నాగిని శ్రీరామ వర్మ,మిట్ట రమేష్,చందా లక్ష్మినారాయణ, కట్ల రవిందర్, వరమని ప్రమోద్ కుమార్,ముద్దసాని శోభ,యండి రఫీ,కిరణ్ , అకెనేపల్లి రాజేష్ తల్లిదండ్రులు ,దుర్గం వెంకటి,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img