Homeఆంధ్రప్రదేశ్#AP : 7న రాష్ట్రానికి రానున్న రాష్ట్ర‌ప‌తి

#AP : 7న రాష్ట్రానికి రానున్న రాష్ట్ర‌ప‌తి

President RamnathKovind is scheduled to visit AP. He will tour Chittoor district on the 7th of this month.

Arrive Madanapalle at 12.10 pm on Sunday by AirForce Helicopter from Bangalore Airport.

The President will be welcomed by Governor VishwabhushanHarichandan and CM YS Jagan.

Afterwards, Kovind will reach Satsang Ashram by road from Madanapalle.

Participate in the stone laying ceremony at the Ashram and the launch of the Bharat Yoga Center Yoga Center.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ నెల 7న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.

బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో ఆదివారం మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లె వస్తారు. రాష్ట్రపతికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌ స్వాగతం పలుకనున్నారు.

అనంతరం కోవింద్‌ మదనపల్లె నుంచి రోడ్డు మార్గాన సత్సంగ్‌ ఆశ్రమానికి చేరుకుంటారు. ఆశ్రమంలో జరిగే శంకుస్థాపన,

భారత్‌ యోగా విద్యా కేంద్ర యోగా కేంద్రం ప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సత్సంగ్‌ విద్యాలయం, సదుం మండలంలోని పీపుల్స్‌గ్రోవ్‌ స్కూల్‌కు చేరుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతారు.

విద్యార్థులు, టీచర్లతో రాష్ట్రపతి ముఖాముఖిగా మాట్లాడతారు. సాయంత్రం 4.50 గంటలకు అక్కడి నుండి హెలికాప్టర్‌లో బెంగళూరుకు తిరుగు పయనం అవుతారు.

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్రపతి కోవింద్‌తో కలసి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మదనపల్లె బీటీ కళాశాలలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం విజయవాడకు తిరుగు పయనం అవుతారు.

Recent

- Advertisment -spot_img