ఇదే నిజం, ధర్మపురి టౌన్, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన నూగురి అర్చన దండేపల్లి మండల్ రెబ్బెన గ్రామంలోని బడిలో ఉపాధ్యాయురాలిగా పనిచేయుచున్నది. ఈ యొక్క ఉపాధ్యాయురాలుకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్రపతి అవార్డు రావడం జరిగింది. గత 24 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని నియమ, నిబద్ధత గా నిర్వహిస్తున్న విధానం, ఆమె సాధించిన విజయాలను తండ్రి అయిన నూగూరి విద్యాసాగర్ సరస్వతి నమస్తుభ్యం అను పుస్తక రూపం లొ రచించడం జరిగింది. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన పదోన్నతులు వచ్చిన ఉపాధ్యాయుల సమ్మేళనం నందు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించారు అర్చనను ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈరోజు అర్చన ఎమ్మెల్యే హైదరాబాదులోని ఇంటికి వెళ్లి వారికి బొకే శాలువాతో సన్మానం చేసి పుస్తకాన్ని ఇచ్చి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసినది.