Homeఫ్లాష్ ఫ్లాష్Winter Diseases : చ‌లికాలం అరోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఆహారంలో వీటిని వాడండి..

Winter Diseases : చ‌లికాలం అరోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఆహారంలో వీటిని వాడండి..

Prevent Winter Diseases with including these in food : చ‌లికాలం అరోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఆహారంలో వీటిని వాడండి..

వర్షా కాలం ముగిసి శీతాకాలం వస్తుందనగా అనారోగ్య సమస్యలు(Winter Diseases) తలెత్తే ఆస్కారం ఎక్కువ.

అందుకే ఇంట్లో వారందరికీ రోగనిరోధక శక్తికి ఉసిరి ఇవ్వండి.

ఉసిరి పొడిని పెద్దలు ఒక స్పూన్‌, పిల్లలు అరస్పూన్‌ తీసుకోవాలి.

అన్నంలో తొలిముద్ద ఉసిరి కాయ పచ్చడితో తినండి.

ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే సి విటమిన్‌ను బాగా అందిస్తుంది.

ఆహారంలో అల్లం, వెల్లుల్లి భాగం చేసే క్రమంతప్పక తీసుకోండి.

ఇవి యాంటీవైరస్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ శక్తి కలిగినవి.

వేప ఆకులను వేసి ఉంచిన నీటితో స్నానం చేయడం, ఇంట్లో కర్పూరం వెలిగించడం ఆరోగ్యకరం.

తులసి ఆకుల రసం తీసి త్రాగితే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.

యూకలిఫ్టస్ ఆయిల్‌ ఆవిరి పీలిస్తే ముక్కులో చేరిన వైరస్‌లు తొలగిపోతాయి.

పసుపు చల్లి ఉడికించిన వంటకాలు, నల్లమిరియాలు వాడిన వంటకాలు తినటం వల్ల రోగాలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

Recent

- Advertisment -spot_img