ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల ధర్మపురి పట్టణంలో జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి యొక్క రైతు బంద్ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన మంచిర్యాల జిల్లా సహకార అధికారి బి.రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది ఈ సమావేశంలో వ్యవసాయం సొంతంగా చేసే ప్రతి రైతు కి ఎకరాలతో సంబంధం లేకుండా ఎంత భూమి ఉంటే అంత భూమి కి రైతు బందు ఇవ్వాలని సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానం చేసారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు, మంచిర్యాల జిల్లా సహకార అధికారి బి. రామోహన్, సంఘ అడప్షన్ అధికారి బి. రాము మరియు సంఘ సీఈఓ అయ్యేరీ రాజేశ్ మరియు రైతులు పాల్గొన్నారు.