న్యూఢిల్లీః ఇటీవల బాంబులను గుర్తించి వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఆర్మీ డాగ్స్ విడా, సోఫీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం(ఆగస్టు 30)న తన 68వ మన్‌కి బాత్‌లో ప్రస్తావించారు. దాంతో విడా, సోఫీ గురించి తెలసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు.
సైనిక పతకాలు పొందిన డాగ్స్
లాబ్రడార్ జాతికి చెందిన విడా, కాకర్ స్పానియల్ సోఫీ శునకాలు ఆర్మీ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్మీ డాగ్ యూనిట్‌కు చెందిన విడా ఇటీవల భూమిలో పాతిపెట్టిన ఐదు మైన్స్‌ను, ఒక గ్రెనేడ్‌ను గుర్తించింది. తద్వారా సొంత దళాలకు ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు జరగకుండా కాపాడింది. అలాగే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్)కు చెందిన ‘సోఫీ’ ఇటీవల ఢిల్లీలో ఓ చోట ఇలాంటి పేలుడు పదార్థాలను కనుగొంది. దీంతో పెను ప్రాణ నష్టం తప్పింది. ఈ రెండు శునకాలను 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ప్రశంసా పత్రం, బ్యాడ్జీలతో సత్కరించారు.