Homeహైదరాబాద్latest Newsఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. జనవరి 8న సాయంత్రం 4.15 గంటలకు విశాఖపట్నం చేరుకుని.. సిరిపురం నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మహాసభలో పాల్గొంటారు. ఈ సమావేశం గంటపాటు జరగనుంది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం అదే రోజు రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

Recent

- Advertisment -spot_img