ఇదేనిజం, వెబ్‌డెస్క్: భారత్ , భూటాన్ భాగస్వామ్య బలోపేతం కోసం ప్రధాని మోదీ భూటాన్‌కు చేరుకున్నారు. భూటాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి రెండు రోజులు పర్యటించనున్నారు. రాజధాని థింపూలోని పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని షెరింగ్ తోబ్గే స్వాగతం పలికారు. మోదీ భూటాన్ రక్షణ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. షెడ్యూల్ ప్రకారం గురువారమే బయలుదేరాల్సి ఉంది. భూటాన్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలించక ప్రయాణం వాయిదా పడి, ఈ రోజు ఉదయం బయలుదేరారు. ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’పై భారత వైఖరిని పునరుద్ఘాటించడమే ఈ పర్యటన ఉద్దేశంగా ఉంది.