Homeహైదరాబాద్latest NewsLok Sabha Elections: మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ..

Lok Sabha Elections: మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 30న మోడీ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా జోగిపేట అల్లదుర్గ్‌లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రధాని మోదీ వచ్చే నెల 3, 4 తేదీల్లో మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నారాయణపేట, చేవెళ్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు మోదీ హాజరుకానున్నారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మోడీ తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img