మహారాష్ట్ర లోని రాయ్ గఢ్ లో భవనం పడిపోయి ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాధ ను వ్యక్తం చేశారు. ‘‘మహారాష్ట్ర లోని రాయ్ గఢ్ లో గల మహాడ్ లో భవనం పడిపోయిన సంగతి తెలిసి ఖిన్నుడినయ్యాను. ఈ ఘటన లో ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల శోకం లో నేను కూడా పాలుపంచుకొంటున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఎన్ డిఆర్ఎఫ్ జట్లు, ఇంకా స్థానిక అధికారిగణం విషాదభరిత ఘటన స్థలం వద్ద ఉండి, సాధ్యమైన సహాయాన్నంతా అందిస్తున్నారు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.