ఏపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సభా వేదికపై ఉన్న అతిథులను ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి మాట్లాడారు. పవన్ కల్యాణ్, చిరంజీవితో కలిసి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఈ సందర్భంగా తన తమ్ముడు సాధించిన విజయానికి ఆనందంతో చిరు భావోద్వేగానికి లోనయ్యారు.