Homeసినిమాఅక్టోబర్‌లో సెట్స్ పైకి సర్కారు వారి పాట

అక్టోబర్‌లో సెట్స్ పైకి సర్కారు వారి పాట

హైద‌రాబాద్ః ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధం అయ్యింది. పరుశురామ్ దర్శకత్వం వ‌హించనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకుంది. తొలి షెడ్యూలు షూటింగును అక్టోబర్ నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వడంతో ఇక ఆలస్యం చేయకుండా షూటింగ్ రెడీ అవుతోందట చిత్రబృందం. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img