వార్షిక నివేదికలో ఆర్‌బీఐ
ముంబాయిః గత ఏడాది కాలంగా రూ.2 వేల నోట్లను ప్రింటింగ్ చేయడం లేదని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తన వార్షిక నివేదికలో వెల్లడించింది. చలామణిలో ఉన్న మొత్తం నోట్ల పరిమాణంలో 2018లో 3.3 శాతం, 2019లో 3 శాతంగా ఉన్న రూ.2వేల నోట్లు 2020 మార్చినాటికి 2.4 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది. ఇదే సమయంలో రూ.200, రూ.500 నోట్ల చలామణి పెరిగిందని పేర్కొంది. వీటి పరిమాణం, విలువ 2018 నుంచి క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికల్లో వెల్లడించింది. నోట్ల సరఫరాపై కరోనా ప్రభావం ఉన్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 23.3 శాతం నోట్ల సరఫరా తగ్గినట్లు ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
ఏడాదిగా రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ బంద్
RELATED ARTICLES