ఇదే నిజం, నల్లగొండ : లోక్ సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రచారం కోసం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ముందస్తు అనుమతిని తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.