Homeహైదరాబాద్latest Newsఆ సినిమా కోసం 31 కిలోలు తగ్గిన Prithvi Raj

ఆ సినిమా కోసం 31 కిలోలు తగ్గిన Prithvi Raj

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్​ సుకుమారన్​ ఇటీవల ప్రభాస్​తో కలిసి నటించిన ‘సలార్’ (Salaar) మూవీతో టాలీవుడ్​లోని మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన మెయిన్ లీడ్​లో నటించిన మలయాళ మూవీ ‘ఆడు జీవితం’. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. ‘దిగోట్‌ లైఫ్‌’ పేరుతో ఇంగ్లీష్‌లోను రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పృథ్వీరాజ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో నా పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గాను. ఈ సినిమా కోసం మేమందరం చాలా కష్టపడ్డాం’ అని చెప్పాడు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం వైరల్​గా మారాయి.

Recent

- Advertisment -spot_img