విద్యాశాఖమంత్రికి హెచ్ఎస్‌పీఏ ఫిర్యాదు
హైదరాబాద్ః ప్రభుత్వ జీవో నెం.46ను పట్టించుకోకుండా ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులను వసూలు చేస్తూ అధిక సమయం ఆన్‌లైన్ క్లాసులను తీసుకుంటున్నారని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్(హెచ్ఎస్‌పీఏ) ప్రతినిధులు సీమ, వెంకట్, హరీష్‌లు మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని స్కూల్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఐసీఎస్సీ, సీబీఎస్సీ, స్టేట్ సిలబస్‌లను తమకు తోచిన విధంగా మార్చుకుంటూ స్టూడెంట్స్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షల తేదీలపై అనేక మంది స్టూడెంట్స్, పేరెంట్స్ తమ అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకొచ్చినట్టు మంత్రికి వివరించినట్లు హెచ్ఎస్పీఏ ప్రతినిధులు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ స్కూల్స్
RELATED ARTICLES