Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరనను నిలిపివేసి సింగరేణి సంస్థకు అప్పగించాలి: మోడెం మల్లేశం

తెలంగాణలో బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరనను నిలిపివేసి సింగరేణి సంస్థకు అప్పగించాలి: మోడెం మల్లేశం

ఇదే నిజం, నర్సంపేట: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని బొగ్గు బ్లాక్ లను ప్రవేటికరించాలనే ఆలోచన విరమించుకొని, తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు ఏఐఎఫ్టియు (న్యూ) ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డిఓ కి వినతి పత్రం సమర్పించడం జరిగినది. అనంతరం ఏ ఐ ఎఫ్ టి యు (న్యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మోడెం మల్లేశం మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయడం ద్వారా ఉత్పత్తి పెంచడం అనే పేరుతో బొగ్గు గనుల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. 2020లో ప్రారంభించి ఇప్పటికీ 107 బొగ్గు గనుల బ్లాకులను 10 రౌండ్లుగా జరిగిన వేలం పాటలలో ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ పదవ రౌండ్ లో బొగ్గు లభించే 8 రాష్ట్రాలలో 67 బ్లాక్ లకు వేలం పాటలకు ప్రకటన ఇచ్చింది. వీటిలో తెలంగాణలోని శ్రావణపల్లి, తాడిచర్ల, సత్తుపల్లి, కోయగూడెం బొగ్గుగనుల బ్లాక్ లను ప్రవేట్ శక్తులకు వేలంపాట ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సిద్ధపడుతుంది. ఇది గని కార్మికుల మెడకు ఉరితాడు బిగించడమే అని అన్నారు.

సింగరేణిని బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థగా మాత్రమే చూడకూడదు. అది కార్మికుల అస్తిత్వానికి ప్రతీక దీనిని ప్రైవేటుపరం చేయకూడదు. బొగ్గు గనుల ప్రైవేటీకరణలో అక్రమాలను నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకానీ వేలం వేసి ప్రైవేటీకరించాలని చెప్పలేదు. ఈ నేపథ్యంలో బొగ్గు గనుల అమ్మకాలను ఉపసంహరించుకోవాలని తెలంగాణలో వేలానికి పెట్టిన నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించాలని, సింగరేణి పరిరక్షణకు ఓపెన్ క్యాస్టులను నిలిపివేసి అండర్ గ్రౌండ్ బావులను తీయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపివేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఏఐఎఫ్టీ యూ (న్యూ) వరంగల్ జిల్లా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో నాయకులు భూమా అశోక్, శివరాత్రి కుమార్, బోనగిరి రామ్మూర్తి, బోనగిరి సారయ్య, ఈర్ల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img