ఆమె అందం చూసే రాజ్యసభ సీటు..
- మహిళా ఎంపీపై శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
- క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్..
priyanka chaturvedi: ఇదేనిజం, నేషనల్ బ్యూరో: శివసేన (శిందేవర్గం) ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్.. ఉద్దవ్ వర్గానికి చెందిన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేదిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె అందం చూసే ఆధిత్య ఠాక్రే ఎంపీగా అవకాశం కల్పించారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. సంజయ్ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ కామెంట్స్ పై ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ‘నేను ఎలా ఉన్నానో .. ఎక్కడ ఉన్నానో మీలాంటి వారు చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. ఇవి మహిళల హుందాను దిగజార్చేలా ఉన్నాయి. వారి అభిప్రాయాలను గౌరవించండి ’అని ట్విట్ చేశారు.