- పీవీ నర్సింహారావును కాంగ్రెస్ అవమానించింది
- ఆ విషయం ప్రియాంకకు తెలియదా?
- ఐటీ మంత్రి కేటీఆర్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ప్రియాంకా గాంధీకి చరిత్ర తెలియకపోవడం దారుణమని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ ఎంతో అవమానించిందని గుర్తు చేశారు. ఆ విషయం ప్రియాంకా గాంధీకి తెలియదా? అని ప్రశ్నించారు. పీవీ అందరూ అభిమానించే వ్యక్తి అని పేర్కొన్నారు. అభిమానించే వ్యక్తి అని, భూమి పుత్రుడని, తన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన అలాంటి మానవతామూర్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందని మంత్రి చెప్పారు. కేటీఆర్ శనివారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1996లో సిట్టింగ్ ప్రధానిగా ఉన్న పీవీ నర్సింహారావుకు ఎంపీ టికెట్ నిరాకరించి.. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని మంత్రి తెలిపారు. పీవీ మరణించినప్పుడు కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని అనుమతించకుండా అవమానించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.