ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ చౌరస్తా నుండి పోతుగల్ మైసమ్మ యూత్ సంఘ సభ్యులు వినాయక చవితి పండుగ రెండు రోజులు ఉండగానే మైసమ్మ యూత్ సభ్యులు 18 అడుగుల వినాయక విగ్రహాన్ని భాజా భజంత్రీలతో ముస్తాబాద్ పట్టణ కేంద్రం నుండి పోతుగల్ గ్రామం వరకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లడాన్ని చూసి పట్టణ ప్రజలు ఆశ్చర్యపోయారు. పండగకు ముందే ఇలా తీసుకెళ్తారని ముచ్చటించుకుంటున్నారు