Homeవిద్య & ఉద్యోగంProdigy 2022 Grant : టాపర్లకు 20 లక్షల రూపాయల వరకూ గ్రాంట్‌

Prodigy 2022 Grant : టాపర్లకు 20 లక్షల రూపాయల వరకూ గ్రాంట్‌

Unacademy Prodigy 2022 Grant : టాపర్లకు 20 లక్షల రూపాయల వరకూ గ్రాంట్‌

Unacademy Prodigy 2022 Grant :భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్‌అకాడమీ నేడు తమ నాల్గవ ఎడిషన్‌ జాతీయ ప్రతిష్టాత్మకమైన స్కాలర్‌షిప్‌ పరీక్ష – అన్‌అకాడమీ ప్రోడిజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ పరీక్షలు జెఈఈ, నీట్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ మరియు  7నుంచి 10 వ తరగతి అభ్యాసకులకు అందుబాటులో ఉంటుంది.

అన్‌అకాడమీ ప్రోడిజీ కార్యక్రమంలో టాపర్లుగా నిలిచిన వ్యక్తులకు 20 లక్షల రూపాయల వరకూ గ్రాంట్‌ను తమ అండర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్య కోసం అందుకునే అవకాశంతో పాటుగా ఉత్సాహపూరితమైన రివార్డలను సైతం అందుకునే అవకాశం ఉంది.


అన్‌అకాడమీ ప్రోడిజీని రేపటి తరపు మేధావులకు మద్దతునందించే రీతిలో తీర్చిదిద్దారు.

Visa : శక్తిమంతమైన పాస్ పోర్ట్ జాబితాలో భారత్.. వీసా లేకుండా 60 దేశాలకు

Insurance : 2 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా

ఈ కార్యక్రమంతో వారు లక్ష్యాలను చేరుకోగలరు.

ఈ కార్యక్రమం కింద, అన్‌అకాడమీ నాలుగు స్కాలర్‌షిప్‌ పరీక్షలను 23జనవరి మరియు  29 జనవరి, 06 ఫిబ్రవరి మరియు 13 ఫిబ్రవరి 2022 తేదీలలో నిర్వహించనుంది. 

ఈ పరీక్షలను ఫైనల్‌ పరీక్ష పద్దతిలో నిర్వహిస్తారు. ఈ స్కాలర్‌ షిప్‌లో ప్రతి ఒక్కటీ 60 నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది. 

ఈ ప్రశ్నాపత్రంలో అప్టిట్యూడ్‌, వెర్బల్‌ సామర్థ్యం, లాజికల్‌ రీజనింగ్‌ మరియు సాధారణ సైన్స్‌కు సంబంధించి 35 ప్రశ్నలుంటాయి.

అన్‌అకాడమీ ప్రోడిజీలో పాల్గొన్న ఔత్సాహికులు ఉత్సాహపూరితమైన బహుమతులు అందుకునేందుకు అర్హులు.

ఇవి వారి తదుపరి విద్యకు మద్దతునందిస్తాయి. దీనితో పాటుగా అన్‌అకాడమీ చందాపై 100% చందా పొందవచ్చు.

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Electronics Price : ఈ ఎండాకాలం ఫ్రిజ్‌లు-ఏసీల ధరల మంట‌లు

అంతేకాదు, 29 జనవరి మరియు 13 ఫిబ్రవరి తేదీలలో పరీక్షలలో పాల్గొనే అభ్యర్ధులకు 20 లక్షల రూపాయల కాలేజీ గ్రాంట్‌ను తమ అండర్‌ గ్రాడ్యుయేట్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్య కోసం అందుకునే అవకాశం ఉంది.

ఈ బహుమతులను 13 ఫిబ్రవరి 2022 న అందించనున్నారు. అన్‌అకాడమీ ప్రోడీజీ ద్వారా, ఔత్సాహిక విద్యార్ధులకు తమకు కష్టతరమైన అంశాలేమిటనేది తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

దీనితో పాటుగా అన్‌అకాడమీ  నిపుణులు సవివరమైన స్కోర్‌కార్డ్‌ కూడా  అందిస్తారు.

అంతేకాదు, ఈ ప్లాట్‌ఫామ్‌పై అందించిన  వీడియో పరిష్కారాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.

అభ్యాసకులు తమంతట తాముగా  నమోదు చేసుకోవడం లేదా పరీక్ష గురించిన మరింత సమాచారం పొందడం కోసం https://unacademy.com/scholarship/prodigy2022 చూడవచ్చు.

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

Gothram : గోత్రం అంటే ఏమిటి? దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి

Recent

- Advertisment -spot_img