Homeహైదరాబాద్latest Newsవివాదంలో చిక్కుకున్న నిర్మాత దిల్ రాజు.. తెలంగాణ ప్రజలు అందుకోసమే..!!

వివాదంలో చిక్కుకున్న నిర్మాత దిల్ రాజు.. తెలంగాణ ప్రజలు అందుకోసమే..!!

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా 2025లో జనవరి 14న విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిజామాబాద్ లో నిర్వహించారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు తెలంగాణ ప్రజలును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ”ఆంధ్రాకు వెళ్తే సినిమా అంటే ఒక వైబ్ ఇస్తారు… మన తెలంగాణలో మాత్రం దగ్గర కల్లు, మటన్ క్కు వైబ్ ఇస్తాం” అని అన్నారు. దీంతో తెలంగాణ ప్రజలను అవమానించారంటూ కొందరు ఈ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img